SRPT: మోతె మండలం విభళాపురం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు అనురాధ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సురేశ్, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.