మేడ్చల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో బ్యాచ్లో 30 మందిని ఎంపిక చేసి 45 రోజుల పాటు వృత్తి నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీనివల్ల యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించే అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. శామీర్పేట పాత గ్రామపంచాయతీ భవనంలో NCC కేంద్రం ఏర్పాటు చేశారు.