WNP: ఆయిల్ ఫామ్ పంట సాగు ధ్వారా లభించే లాబాలపై శుక్రవారం అధికారులు పెద్దమందడి మండలం మొజర్ల గ్రామంలోని రైతువేధికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ పంటసాగు రైతులకు దీర్ఘకాళికంగా మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా నిలుస్తుందన్నారు. రైతులు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు.