NGKL: ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ రోగుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా.ఉషారాణి తెలిపారు. నీటి వసతి, ఆక్సిజన్, ఐవీ ఫ్లూయిడ్స్‌తో పాటు 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు ఎండలో అనవసరంగా బయటకు రావొద్దని, జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.