KMR: అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉపయోగపడుతోందని నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన దేగావత్ భారతి అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5లక్షలకు సంబంధించి ఎల్వోసీని ఎమ్మెల్యే గురువారం అందజేశారు.