SRPT: శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సర్వే నిర్వహించి మాట్లాడారు..