MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం పాలకవర్గ సభ్యులు, యువత హనుమాన్ ఆలయం వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించి శుభ్రం చేశారు. గతంలో నిర్వహించి నిలిపివేయగా, మళ్లీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. హనుమాన్ ఆలయం వద్ద జరిగిన స్వచ్ఛ భారత్లో సర్పంచ్ వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, యువత పాల్గొన్నారు.