KNR: వెన్నంపల్లి సహకార సంఘం ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మహా జనసభలో పర్సన్ ఇన్ఛార్జ్ ముంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని ఆయన కోరారు. సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాల్లో దీనిని సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు గ్రామాల సర్పంచులు, రైతులు, పాల్గొన్నారు.