MNCL: నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఎల్పుల నాగలక్ష్మి- తిరుపతి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. సొంత గూడు లేక చిన్న షెడ్డు వేసుకొని దానికి కవర్ కప్పి జీవనం సాగిస్తున్నామన్నారు. ఇందిరమ్మ లిస్టులో పేరు వచ్చిన అధికారులు ఇళ్లు మంజూరు చేయలేదని వాపోయారు.