WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. 30 ఏళ్లుగా ఎలాంటి నియామకాలు జరగకపోవడంతో 100 మందికి పైగా ఉండాల్సిన చోట కేవలం 28 మంది మాత్రమే పని చేస్తున్నారు. నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే నిర్వహించాల్సి వస్తోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉద్యోగుల పనిభారం పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.