KNR: కరీంనగర్లో భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ‘2కే రన్’ ఉత్సాహంగా సాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.