KMM: మధిర మండలం ఆత్కూరు సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదివారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల వల్ల జరిగిన ఆస్తి.పంట నష్టంపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.