భారత రాజకీయాల్లో ప్రధాని మోదీ ఓ చారిత్రక మైలురాయిని అందుకున్నారు. సిక్కిం మాజీ సీఎం పవన్‌కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. పవన్‌కుమార్ చామ్లింగ్ సిక్కిం CMగా 8,930 రోజులు పదవిలో కొనసాగగా, మోదీ ఆ రికార్డును దాటి 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా ఆయన పనిచేసిన కాలాన్ని కలిపి ఈ ఘనత సాధించారు.