NDL: నందికొట్కూరు మండలం బొల్లవరంలో శిథిలావస్థకు చేరిన తాగునీటి ట్యాంకును ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇవాళ పరిశీలించారు. నీటి ట్యాంకు పునరుద్ధరణకు నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట నందికొట్కూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి ఉన్నారు.