JN: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా లింగాల ఘనపూర్ మండలంలోని బండ్లగూడెం గ్రామ రైతువేదికలో POలకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులు చాలా కీలకమని, రిపోలింగ్కి ఆస్కారం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.