MBNR: కోయిలకొండ మండలం రామన్నపల్లి తండాలో బంజారాల ఆరాధ్య దైవాలైన సంత్ శ్రీ సేవాలాల్, మారెమ్మ ఆలయాల నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ జేసీబీతో భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. భక్తిభావం పెంపొందించేలా ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామస్థులందరూ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.