BHNG: రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది. ఖాళీ యూరియా బస్తాలలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి ప్రేమ లేదన్నారు.