వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులోని ఓ మిల్లు వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5,350 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.