SRCL: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే అన్ని సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి కార్యదర్శి అనిత రామచంద్రన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.