SRCL: గ్రామాలలో ఎవరైనా కుల వివక్షకుపాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో ఒకరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ చేపట్టారు. ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.