WNP: పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన కూచిపూడి కళాకారిణి ఎస్.ఎస్. జైశ్రీ అరుదైన గౌరవం అందుకున్నారు. ఇప్పటి వరకు 54 ప్రదర్శనలు ఇచ్చి పలు అవార్డులు గెలుచుకున్న ఆమె ప్రతిభను గుర్తించి,’నవ భారత్ కళాక్షేత్రం’ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ స్వర్ణ నంది అవార్డును ప్రదానం చేశారు. గడ్డం సుధాకర్-సంధ్య దంపతుల కుమార్తె అయిన జైశ్రీని గ్రామస్తులు అభినందించారు.