MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.