MBNR: మన్యంకొండ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజలు, హారతులు, ప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.