HYD: నిమ్స్ సమాచార సేకరణ కోసం వెళ్లే జర్నలిస్టులకు సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం వైద్యులు ఇంటర్వ్యూలు, దవాఖానలో విజయవంతమైన ఆపరేషన్లు, వివిధ వైద్య విభాగాలకు సంబంధించిన అవగాహన సదస్సులు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే జర్నలిస్టులు పార్కింగ్తో పాటు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.