VKB: నవాంద్గీ రైల్వే స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు స్టాప్ శుక్రవారం ప్రారంభమైంది. MP కొండ విశ్వేశ్వర్ రెడ్డి, MLA బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని రైలుకు పచ్చజెండా ఊపారు. రైలు ఆగడం వల్ల బషీరాబాద్ ప్రాంతానికి రవాణా సౌకర్యం పెరుగుతుందని, అభివృద్ధికి దోహదం అవుతుందని ఇద్దరూ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.