NRPT: దామరగిద్ద మండలం విఠలాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సదాశివరెడ్డి, సర్పంచ్ హనుమంతుతో కలిసి ప్రారంభించారు. ఈ ఉపకేంద్రం వల్ల గ్రామంలో లో వోల్టేజ్ సమస్య తీరనుందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.