JGL: రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో గుర్తుతెలియని మహిళ ప్రత్యక్షమైంది. గ్రామం చివరలోని పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలో ఉన్న ఆమెను గమనించిన యువకులు వివరాలు అడగగా “గుల్లకోట” అని చెప్పినట్లు తెలిపారు. ఆమె మతిస్థిమితం సరిగా లేని పరిస్థితిలో ఉన్నట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. గ్రామ యువకులు, ఉపసర్పంచ్ వేల్పుల భూమేష్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయానికి తరలించారు.