KMR: బాన్సువాడ మండలం కోనాపూర్ శివారులో 2024లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.