KMM: మధిర శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మండప అధ్యక్షుడు కురువెళ్ల కృష్ణ ఆధ్వర్యంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన త్యాగాలను, జీవిత విశేషాలను సభ్యులు స్మరించుకున్నారు.