NZB: డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో అంబేడ్కర్ విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో కన్వీనర్ అశ్విత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు SFI, ABVP, NSUI, PDSU, MSF వంటి అన్ని విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. విగ్రహ ప్రతిష్ఠాపనకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు.