SDPT: బెజ్జంకి మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో పొద్దుతిరుగుడు విత్తనాల కొనుగోలు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారం శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర కొనుగోళ్లు ముగిసినట్లు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మార్కెట్లో వేల క్వింటాళ్ల పంట నిల్వలో ఉందని తెలిపారు.