WNP: అమరచింత చెరువు సుందరీకరణ పనులపై ఎంపీ డీకే అరుణ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు గురువారం హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరి రూ.3.14 కోట్లతో శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ ఎంపీ శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు.