PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖలకు చెందిన మహిళలు, మహిళా వార్డు సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న ఆదివారం కావడంతో ఇవాళ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీవో రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్పాల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.