KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన వోడ్నాల రాంప్రసాద్ అకౌంట్ నుంచి కొంత డబ్బును సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. ఈనెల 22న రూ. 5 వేలు, ఈనెల 23న రూ. 71,500 తన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. తన అకౌంట్ నుంచి డబ్బులు పోవడంతో బ్యాంకులో సంప్రదించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపాడు.