HYD: గత కొన్ని రోజులుగా కోళ్లకు వస్తున్న బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినొద్దంటూ ప్రభుత్వం చెబుతుంటే మరోపక్క పాడైపోయిన చికెన్ అమ్మేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని ఓ చికెన్ దుకాణంలో 2 క్వింటాళ్ల వరకు పాడైపోయిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఈ చికెన్‌ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న దుకాణదారుడు పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.