ASF: రెబ్బెన మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కే. హరిత, సెంట్రల్ ప్రభారీ అధికారి రజత్ కుమార్ సైని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్‌ను పరిశీలించారు. రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సూచించారు.