ADB: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు లంక రాఘవులు అన్నారు. ఆదివారం సత్నాల మండల కేంద్రంలో నిర్వహించిన 3వ రైతు మహాసభల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర, విత్తనాలు, ఎరువుల పంపిణీ సక్రమంగా అందేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.