VKB: దౌల్తాబాద్ మండలంలోని యాంకిలో గురువారం క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ పెద్దలు వైభవంగా ప్రారంభించారు. సర్పంచ్ ఏ.మాణిక్యప్ప, రవీందర్ రెడ్డి, కోట్ల హన్మంతు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.