KMR: నాగిరెడ్డిపేట్లోని ధర్మారెడ్డిలో ఆదివారం బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు షీ టీం సిబ్బంది బాల్య వివాహాన్ని అడ్డుకుని బాలికను చైల్డ్ ప్రొటెక్షన్ కేర్ యూనిట్ KMRకు తరలించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు నేరమని, ఈ మేరకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.