ASF: కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నుపై 5% రాయితీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పన్ను చెల్లించే వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తుగా చెల్లించి రాయితీ పొందడంతో పాటు జరిమానాలను తప్పించుకోవాలని సూచించారు. బిల్ కలెక్టర్లు లేదా మున్సిపల్ కార్యాలయంలో పన్ను చెల్లించాలని కోరారు.