MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఉండే యువత ఉపాధి లేక వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు. వాస్తవానికి జన్నారం కవ్వాల్ అభయారణ్య పరిధిలోనే ఉంది. చాలామంది యువకులు స్వయం ఉపాధి కోసం ఆటోలు, గూడ్స్ బండిలను తీసుకుని ఉపాధి పొందారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం, తదితర కారణాలతో గిరాకీలు లేక వారు ఉన్న వాహనాలను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి వలస పోతున్నారు.