JGL: ఏసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మార్గదర్శకత్వమని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ప్రపంచానికి బోధించిన శాంతి దూత ఏసు అని అన్నారు.