MBNR: వెట్టి చాకిరీ నిర్మూలనకు అందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో మానవ అక్రమ రవాణా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.