BDK: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ అంకిత్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.