ASF: భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశాలలో చేర్చాలని జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రథయాత్ర శనివారం ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ని కలిసి మెమోరాండం అందజేశారు. భారత రాజ్యాంగం ప్రజలకు అర్ధం కావాలంటే చదువులలో ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు.