HYD: వేసవి వేళ మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 4.9 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగిస్తున్నట్లు HMRL అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మెట్రో వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రద్దీ పెరిగి పీక్ అవర్స్‌లో బోగీలు కిక్కిరిసిపోతున్నాయి.