KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఐకేపీ, హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. అనంతరం డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ.. ధాన్యం అమ్మకాల విషయంలో రైతుల కష్టనష్టాలను తొలగించడమే కాకుండా వారికి మద్దతు ధర పొందాలని సూచించారు.