JGL: వెల్గటూర్ మండలం కిషన్రావుపేట గ్రామంలోని నాగపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీస్సులు పొందారు.