BHNG: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో పెరుగుతున్న లవ్ జిహాద్, అక్రమ మత మార్పిడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా ప్రచార ప్రముఖ్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ కుట్రలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న వికృత మనస్తత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.