MDCL: కుత్బుల్లాపూర్లో ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది. కుత్బుల్లాపూర్ ఆదర్శనగర్,ECC, గాయత్రి నగర్ వార్డు కార్యాలయం, మహదేవపురం ఏరియాల్లో సుమారుగా 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించింది. మార్చి చివరి నాటికీ సూర్య భగవానుడు మరింత భగభగమనే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.